AP: 2014లో గుంటూరు-విజయవాడ మధ్య రాజధానికి మాజీ సీఎం జగన్ మద్దతు ఇచ్చారని CM చంద్రబాబు తెలిపారు. ‘అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నారు. CRDA పరిధిలో అమరావతి రాజధాని అని తీర్మానం చేయాలి. రాజధాని అమరావతిపై తీర్మానం చేసి పంపాలని, ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ భేటీలో తీర్మానం చేస్తామని PMO చెప్పింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు’ అని వెల్లడించారు.