TPT: నాయుడుపేట మండలం కూచివాడపాలెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సాయిమనోజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గొట్టిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శంకరయ్య ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. గ్రామ ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్వో, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.