తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11.06 నుంచి మధ్యాహ్నం 1.31 వరకు పూజకు అత్యంత ప్రశస్తమైన సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కళ్యాణం జరగనుంది. ఒంటిగంటలోపు నైవేద్యం సమర్పించి ప్రసాదం స్వీకరించి భోజనం చేయాలని సూచిస్తున్నారు.