SKLM: బాలల హక్కుల పరిరక్షణలో పౌర భాగస్వామ్యం అవసరం అని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు. గురువారం స్థానిక కార్యాలయంలో ‘బాలల స్నేహపూర్వక న్యాయ సేవలు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో అట్టడుగున ఉన్న పౌరులకు సైతం చట్టపరమైన హక్కులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు.