BHNG: ముత్తిరెడ్డిగూడెంలో బ్రిడ్జి నిర్మించకుండా పైపులు తొలగిస్తే ఊరంతా కలిసి కాలువను పూడుస్తామని సీపీఐ(M) నేత కొండమడుగు నరసింహ హెచ్చరించారు. గురువారం వ్యవసాయ కూలీలతో కలిసి కాలువ వద్ద నిరసన చేపట్టారు. రైతులు, కూలీల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ వెంటనే స్పందించి బ్రిడ్జి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.