MHBD: పట్టణంలోని 13వ వార్డు రామచంద్రపురం కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్థానిక కౌన్సిలర్ కాట భాస్కర్ ఈ నిర్మాణ పనులకు భారీ విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా గురువారం రూ.5,11,116 విరాళం గురువారం అందచేశారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సూచించారు.