NDL: బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. డ్రైనేజీలను శుభ్రం చేయించాలని ప్రజలు కోరారు.