HNK: ఈనెల 30న అసెంబ్లీని ముట్టడిస్తామని జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చిలువేరు రమేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఇప్పటివరకు అమలు చెయ్యకపోవడం, కమిటీ వేస్తానని చెప్పి 3ఏళ్ళు అవుతున్నా కమిటీ వెయ్యకపోవడం దారుణమన్నారు. గత 8ఏళ్లుగా ఉద్యమకారుల హక్కులకై పోరాటం చేస్తున్నామని, రాష్ట్రకమిటీ పిలుమేరకు అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు.