AKP: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్లో చేర్పించాలని డీఈవో అప్పారావు నాయుడు గురువారం విజ్ఞప్తి చేశారు. మార్చి ఒకటవ తేదీ నుంచి అడ్మిషన్స్ కూడా ప్రారంభం అయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. మౌలిక సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటాయన్నారు.