MHBD: జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చునాయక్ ఇటీవల మరణించగా గురువారం ఆయన దశదినకర్మ కార్యక్రమాన్ని గూడూరు మండలంలోనిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ శబరిష్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లచ్చునాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్‌ను పరామర్శించి, తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.