NGKL: నాగర్ కర్నూల్ మండలం చందుబట్లలో గురువారం అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కలిసి, గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. పలు ఇళ్లను స్వయంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు.