TG: కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే జీవన్ రెడ్డికి సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇప్ప సారా పథకానికి ఇందిరాగాంధీ పేరు పెట్టొద్దని చెప్పానని, తన వ్యాఖ్యలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఏడాదిలో గల్ఫ్ మృతులకు పరిహారం ఇవ్వడం లేదని, 120 మంది చనిపోతే ఒక్క రూపాయి బడ్జెట్లో కేటాయించలేదన్నారు. వెంటనే పరిహారం విడుదల చేయాలన్నారు.