»Tpcc Chief Revanth Reddy Made Hot Comments On Cm Post
CM అభ్యర్థిపై రేవంత్ కామెంట్స్.. ఎవరంటే..?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్ ఉంటుంది. అదే అంశంపై నేతలు ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు. ఇదే అంశంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
CM: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ డజను మంది సీఎం అభ్యర్థులు ఉంటారు. అంతా తమ పార్టీ అధికారంలోకి వస్తోందని.. తామే సీఎం అవుతామని ఇండైరెక్టుగా చెబుతుంటారు. వెంకట్ రెడ్డి లాంటి వారు డైరెక్టుగా చెబుతారు. దాంతో.. సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఆదివారం ఆసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని రేవంత్ (Revanth) చెప్పారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థిని హై కమాండ్ నిర్ణయిస్తోందని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై హై కమాండ్ డిసిషన్ ఫైనల్ అని చెప్పారు. ఎన్నికలో తమ పార్టీకి 80 నుంచి 85 సీట్లు వస్తాయని అంటున్నారు. పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ (Revanth)ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం ఆయనకు చేతకావడం లేదన్నారు. అందుకే ఛత్తీస్ గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్.. తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
రాష్ట్రంలో ఏ సబ్ స్టేషన్‌కైనా వెళదాం.. ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నారో చూపించాలని రేవంత్ (Revanth)మరోసారి నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. రూ.3కు వచ్చే యూనిట్ కరెంట్‌ని.. రూ.14కు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.