సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ‘జిల్లా ఇండస్ట్రీ ప్రమోషన్ కమిటీ’ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీజీ-ఐపాస్ కింద వచ్చే దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.