BDK: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జలాల వినియోగం, సంరక్షణపై విద్యార్థులు, రైతుల్లో అవగాహన కల్పించేందుకు మణుగూరులోని ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో ప్రత్యేక సదస్సు ఇవాళ నిర్వహించారు. భూగర్భ జల అధికారి రమేష్ మాట్లాడుతూ.. ఎక్కడ నీరు సమృద్ధిగా ఉంటుందో అక్కడ లింగ వివక్షత తగ్గుతుందని పేర్కొన్నారు.