TG: HYD కాటేదాన్లో మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీపై మైలార్ దేవ్ పల్లి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, కెమికల్స్ వాడి అపరిశుభ్ర వాతావరణంలో బన్స్, కేకులు తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ బేకరీ యూనిట్ నిర్వహిస్తున్న అఫ్రీదీ అన్సారీ, యాసిన్.. మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.