BPT: అమృతలూరులో గ్రామీణ నీటి భద్రత ప్రణాళికలపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో మారుతి ప్రసూనాంబ మందస్తుగా సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో, సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.