AP: మతం మారిన వారిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని సీపీఐ రామకృష్ణ అన్నారు. సుప్రీం తీర్పుపై తెలుగు ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. దీనిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మతం మారితే అంటరానితనం పోతుందంటే.. దేశంలో అంటరానితనం ఉండదని ఎద్దేవా చేశారు. ఆ తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.