RR: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం మన్మర్రి ప్రాథమిక పాఠశాలలో చదువుకునే ముగ్గురు విద్యార్థులు నిన్న వెలువడిన టీజీ గురుకుల్ సెట్ ఐదవ తరగతి ఫలితాలలో మెరుగైన ప్రతిభను కనబరిచారు. బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఎంపిక అయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మర్పల్లి అశోక్ తెలిపారు. దీంతో ఆ విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు.