E.G: కోరుకొండ మండలం బుల్లెద్దుపాలెం గ్రామంలో నిర్వహించిన గోగులమ్మ జాతర మహోత్సవానికి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గురువారం హాజరయ్యారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులకు అమ్మవారి కరుణా కటాక్షాలు మెండుగా లభించాలని ప్రార్థించారు. అనంతరం బూరుగుపూడి, పిడింగొయ్యి, దివాన్ చెరువు తదితర గ్రామాలలో పర్యటించారు.