ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఈగల్ టీం సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ కలహండికి చెందిన ఆరుగురు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.