GDWL: యాసంగి సీజన్ వరి ధాన్యం సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 87 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.