BDK: అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథ పనులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ నిరసన చేపట్టారు. మనబోతులపాడు, ఎలకలగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో పనులు పూర్తి చేసినప్పటికీ చెల్లింపులు నిలిచిపోయాయని వాపోయారు. అధికారులు తప్పించుకుంటున్నారని, బకాయిల కోసం ఆస్తులు అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.