నంద్యాల: మున్సిపాలిటి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లి ఉత్తమ మున్సిపాలిటిగా నిలబెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మున్సిపాలిటి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై అధికారులతో సమీక్ష చేశారు.