KRNL: పెద్దకడబూరులోని ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్పీ రాఘవేంద్ర తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు ఉంటాయన్నారు. టెన్త్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారని, మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ ను సంప్రదించాలన్నారు.