TG: రాష్ట్రంలో పెట్రోల్ కొరతపై పుకార్లు రావడంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. దీంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ ఏపీ టీడీపీ నేత కూతురు పెళ్లికి హాజరుకావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. సీఎం పెళ్లి వేడుకలకు హాజరవుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.