శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించాడు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటించాల్సిందని తెలిపాడు. ఇందుకోసం మేకర్స్ తనను సంప్రదించారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని వెల్లడించాడు.