MBNR: బంజారా సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ఇవాళ పిలుపునిచ్చిన నేపథ్యంలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు చెందిన DLHSS జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్‌ను టూ టౌన్ పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారాల రాజకీయ అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు పరిరక్షించే చర్యలు తీసుకోవాలని కోరారు.