GDWL: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగాల భర్తీ కోరుతూ ఈనెల 30న గద్వాల పాత బస్టాండ్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పోరు దీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్ను బీఆర్ఎస్ ఇంఛార్జ్ బాసు హనుమంతు బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చి ఈ దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.