NDL: డోన్ మండలం కొచ్చెరువు గ్రామంలో అక్రమంగా నడుస్తున్న గ్యాస్ గోదాంపై అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్నట్లు ఇవాళ గుర్తించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి గోదాంను సీజ్ చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.