E.G: కలియుగ వైకుంఠం అయిన తిరుమల పుణ్యక్షేత్రంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం గడిపారు. కుమారుడితో కలిసి ఏడుకొండల వారిని దర్శించుకున్నారు . స్వామివారికి మొక్కులు తీర్చుకుని, ఆశీస్సులు అందుకున్నారు . వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.