శరీరానికి అవసరమైన పోషకాలు లభించకున్నా లేదా పోషక లోపం తలెత్తినా.. ఆ ప్రభావం జుట్టుపై పడి వెంట్రుకలు రాలిపోతాయి. కురులు ఒత్తుగా, దృఢంగా, మెరుస్తూ ఉండాలంటే రోజువారీ ఆహారంలో విటమిన్ ఇ, డి, సి, బి-కాంప్లెక్స్‌తో పాటు ప్రోటీన్లు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. ఇందుకోసం నిత్యం తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.