VKB: వికారాబాద్ మండలం పుల్ మద్ది గ్రామం శామయ్య టెంట్ హౌస్లో విద్యుత్ షాక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. వికలాంగుడైన శ్యామయ్యకు అదే జీవనాధారం కాగా, సుమారు రూ. 6 లక్షల వరకు నష్టం జరిగినట్టు అంచనా.. ప్రభుత్వం, నాయకులు స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరారు. చాలా రోజులుగా టెంట్ హౌస్ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న శామయ్య ఉపాధి కోల్పోయానని కన్నీరుమున్నీరయ్యారు.