WGL: నల్లబెల్లి మండలంలోని నాగరాజుపల్లె గ్రామంలో ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్టార తిరుపతి రెడ్డి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపరచేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత పాల్గొన్నారు.