CTR: పెనుమూరు మండలంలోని అతిమాకులపల్లి గ్రామానికి చెందిన సుకన్య భర్తతో గొడవపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త బాబు ఎదుటే బావిలోకి దూకినట్లు తెలుస్తోంది. అతనికి ఈత రాకపోవడంతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులను తీసుకొచ్చే సరికి భార్య నీటిలో మునిగిపోయింది. దీంతో గ్రామస్తులు ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.