TG: రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. కాగా నిన్న ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి అపార నష్టం వాటిల్లింది. ఇవాళ కూడా వర్షం హెచ్చరికలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.