ASF: కౌటాల మండలంలోని MPUPS గుడ్లబోరి పాఠశాల విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించిందని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వారికి విద్యను బోధించిన ఉపాధ్యాయులకు కూడా తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.