అన్నమయ్య: జిల్లాలో మహిళల భద్రత లక్ష్యంగా పోలీసులు గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, యువతులు, గ్రామస్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి BNS చట్టాలు, హక్కులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1091, 181, 1098, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని అధికారులు సూచించారు.