E.G: సీతానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, MLHPలు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. తాగునీటి నాణ్యత పరీక్షలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్, ఉప ఎంపీడీవో (GSWS), పరిపాలన అధికారులు హాజరయ్యారు.