TPT: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది. తిరుచానూరులో హోటల్ ప్రారంభోత్సవం, అనంతరం చంద్రగిరిలో యల్లమ్మ ఆలయంలో చండీయాగం, సాయంత్రం నెన్నూరులో శ్రీ రాముల వారి ఆలయ మహా కుంభాభిషేకంలో సతీసమేతంగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.