KNR: రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్లో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి సమస్యలపై చర్చించారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, చివరి మడి వరకు నీటిని అందించి పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.