KMR: కామారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ విక్టర్ ఆధ్వర్యంలో సెన్సస్-2027 సన్నాహక శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. మే 11 నుంచి జరగనున్న గృహ గణన కోసం ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి మండలం, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.