TG: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై పలు చోట్ల వర్షం కురుస్తోంది. మియాపూర్, కూకట్పల్లి, చందానగర్లో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ చిరు జల్లులు కురుస్తున్నాయి. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు.