ADB: జిల్లాలో గేమింగ్, గ్యాంబ్లింగ్, గంజాయి, మాదకద్రవ్యాలు పూర్తిగా రూపుమాపాలని జిల్లా SP అఖిల్ మహాజన్ మంగళవారం తెలిపారు. జిల్లా పోలీస్ అధికారులతో కలిసి నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రోడ్డు భద్రతపై రేపటి నుంచి వారం రోజులపాటు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఉద్యమంలా కొనసాగాలని సూచించారు.