JN: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలోని మోడల్ స్కూల్లో రోల్ మోడల్స్‌తో మంగళవారం బాలికల గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యురాలు అనుమాండ్ల శోభారాణి మాట్లాడుతూ.. జీవితంలో ఎదగాలంటే రోల్ మోడల్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలని, కష్టనష్టాలు అధిగమించిన వారి అనుభవాల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.