MBNR: అడ్డాకల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డి.జానకి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాధితులతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని ఆదేశించారు.