GDWL: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాఫిక్ చలానాలు, చిన్న చిన్న సివిల్, క్రిమినల్ వివాదాలు, కుటుంబ సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో ఇక్కడే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.