MDCL: మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంత రావు సమక్షంలో 183 డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డివిజన్ అధ్యక్షుడు జీడి సంపత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైనంపల్లి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో పార్టీ మరింత బలోపేతమైందని, అందరం కలిసికట్టుగా ప్రజాసేవలో ముందుండాలని MLA పేర్కొన్నారు.