AP: విజయవాడ ఉగ్రమూలాల కేసులో CMM కోర్టు ముగ్గురికి రిమాండ్ విధించింది. షరిఫ్, డానిష్, సొహైల్ బేగ్ అనే యువకులకు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. కాగా, నిందితులు దేశ వ్యతిరేఖ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.