పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రకటన చేశారు. యుద్ధం మొదలైన తర్వాత చాలా మంది దేశాధినేతలతో తాను మాట్లాడినట్లు మోదీ తెలిపారు. యుద్ధ పరిస్థితులపై గల్ఫ్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి నెలకొనాలన్నదే భారత లక్ష్యం అని స్పష్టం చేశారు.